సీబీఎన్టీ టెస్ట్ మిషన్ భైంసా ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయండి : ముధోల్ ఎమ్మెల్యే
టీబి పేషంట్ల వైద్య సేవల టెస్టులకు నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో అదనంగా
దిశ,భైంసా : టీబి పేషంట్ల వైద్య సేవల టెస్టులకు నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో అదనంగా ఉన్నటువంటి సీబీఎన్టీ మిషన్ బైంసా ఏరియా ఆసుపత్రిలో పొందుపరచాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిర్మల్ జిల్లా వైద్యాధికారులను కోరారు. భైంసా పట్టణ ఏరియా ఆసుపత్రిలో టీబీ పేషెంట్లు ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని గురువారం జిల్లా వైద్యాధికారులతో చరవాణిలో మాట్లాడుతూ... ఇక్కడి టీబీ పేషెంట్ల పరిస్థితులను తెలియజేశారు.తొందర్లోనే ఇక్కడ టెస్టులకు సంబంధించి మేషన్ను ఏర్పాటు చేసి సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.దీనిపై సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించారు.