ఏనుగు సంచరిస్తుంది....జాగ్రత్త

ఏనుగు సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్ఓ నీరజ్ కుమార్ సూచించారు.

Update: 2024-10-25 10:25 GMT

దిశ, ఆసిఫాబాద్ : ఏనుగు సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్ఓ నీరజ్ కుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బెజ్జూర్, పెంచికాల్ పేట్, చింతల మానపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగు సంచారిస్తున్నట్లు శుక్రవారం అటవీ శాఖ అధికారులు గుర్తించారని తెలిపారు.

     ఈ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఏనుగు మహారాష్ట్ర సరిహద్దు వైపు వెళ్తుందని, అది మళ్లీ ఈ ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏనుగు కనిపిస్తే ఫొటోలు తీయడం కానీ, వెంబడించడం కానీ చేయొద్దని సూచించారు. 

Tags:    

Similar News