రిమ్స్ లో మరిన్ని వైద్య సేవలు అందించేందుకు కృషి

అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేందుకు రిమ్స్ ఆసుపత్రిలో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ అన్నారు.

Update: 2024-10-07 15:30 GMT

దిశ, ఆదిలాబాద్: అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేందుకు రిమ్స్ ఆసుపత్రిలో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ శుద్దీకరణ (డయాలసిస్) యంత్రాలను రూమ్స్ సూపరిండెంట్ డాక్టర్ అశోక్, ఇతర వైద్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ రిమ్స్ లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఉపయోగార్థం ప్రభుత్వం మంజూరు చేసిన నాలుగు కిడ్నీ శుద్దీకరణ యంత్రాలను ప్రారంభించు కోవడం జరిగిందని, ఇది ఎంతో శుభ సూచకమని పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి 11 కిడ్నీ శుద్దీకరణ యంత్రాలకు అదనంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటి ద్వారా డయాలసిస్ బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజలు, బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో వైద్యులు కే. వెంకట్ రెడ్డి, డాక్టర్ చందు, ఆర్ ఎం ఓ డాక్టర్ కమలాకర్, వైద్యులు రమాదేవి, నర్సింగ్ సూపర్డెంట్ రమాదేవి, ఇంచార్జ్ జిల్లా మేనేజర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ గణేష్, ఇంచార్జ్ డయాలసిస్ సెంటర్, ఇతర వైద్య బృందం, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News