ఆరోగ్యశాఖ ఉద్యోగుల పై ఒత్తిడి సహించం..
రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల మీద పని భారం మరింత పెరిగిందని అధికారుల ఒత్తిడిని ఇక సహించబోమని ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం 3194 ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొందుగుల వెంకటేశ్వర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ శ్యాంసుందర్ పేర్కొన్నారు.
దిశ ప్రతినిధి, నిర్మల్ : రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల మీద పని భారం మరింత పెరిగిందని అధికారుల ఒత్తిడిని ఇక సహించబోమని ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం 3194 ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొందుగుల వెంకటేశ్వర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ శ్యాంసుందర్ పేర్కొన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగ సంఘాల కార్యవర్గ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు కరోనా సీజన్ నుంచి ఆరోగ్యశాఖ ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం పెరిగిందని పేర్కొన్నారు అయినప్పటికీ సామాజిక బాధ్యతగా తమ శాఖ ఉద్యోగులు పని ఒత్తిడిని తట్టుకొని అన్ని రకాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు అయినప్పటికీ ఇతర పనుల పేరిట అధికారులు ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నారని దీన్ని తిప్పికొడతామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండో ఏఎన్ఎం ల సమస్యల పరిష్కారం కోసం దశలవారి పోరాటం చేస్తామన్నారు వారికి వెంటనే టైం స్కేల్ ఇవ్వాలని పేరివిజన్ ప్రకారం డిమాండ్ చేశారు.
వారందరిని రెగ్యులర్ చేసే అవకాశం లేకపోతే జీతభత్యాలు పెంచే అవకాశం లేదా అని ప్రశ్నించారు దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో ఇప్పటికే ఆరోగ్య మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఏప్రిల్ నుంచి వారిని రెగ్యులర్ చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా రెగ్యులర్ చేస్తామని హామీ ఇస్తున్న ఈ ప్రభుత్వం ప్రతిసారి వాయిదా వేస్తూ వస్తున్నదని ఈసారి రెగ్యులర్ చేయకపోతే తమ ఉద్యోగుల ఆందోళన మరోలా ఉంటుందని పేర్కొన్నారు. కరోనా సమయం నుంచి మహిళా ఆరోగ్య కార్యకర్తలకు తీవ్ర పనిభారం పెరిగిందని వారికి అదనపు అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ప్రకాష్ ఉపాధ్యక్షులు భాస్కర్ నిర్మల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణమోహన్ గౌడ్ కన్నయ్య మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల ప్రతినిధులు నాందేవ్ ప్రభాకర్ జగదీష్ ఐజాక్ కోటేష్ నాయకులు భోజా రెడ్డి రవీందర్ మతిన్ శ్రీనివాస్ రెడ్డి రవి కిరణ్ భరత్ పాల్గొన్నారు.