ముధోల్‌పై కాంగ్రెస్ ఫోకస్.. మున్నూరుకాపు నాయకుడికి గాలం?

నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి ఆ పార్టీ పావులు కదుపుతోంది. పార్టీ వీక్‌గా ఉన్న ప్రాంతాలపై దృష్టిసారించి..

Update: 2022-11-27 08:39 GMT

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి ఆ పార్టీ పావులు కదుపుతోంది. పార్టీ వీక్‌గా ఉన్న ప్రాంతాలపై దృష్టిసారించి.. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి ఆ పార్టీ పావులు కదుపుతోంది. పార్టీ వీక్‌గా ఉన్న ప్రాంతాలపై దృష్టిసారించి..బలమైన నాయకులకు కాంగ్రెస్ కండువ కప్పేందుకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల నాటికీ టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా నాయకులను బరిలోకి దించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ముధోల్ నియోజకవర్గంపై టీ కాంగ్రెస్ నజర్ పెట్టింది. ఇప్పటి వరకు ఇక్కడ బలమైన నాయకుడిగా ఉన్న నిర్మల్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు పవర్ రామారావు పటేల్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఇక్కడ నాయకుడు అనివార్యం అయింది. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇక్కడ బలంగా ఉండటంతో వారిని ఢీకొట్టగలిగే నేత కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది.

మున్నూరు కాపులకు పెద్దపీట వేసేదిశగా అడుగులు?

ముధోల్ నియోజకవర్గంలో మున్నూరు కాపులు ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ ఆ సామాజిక వర్గానికి 30 నుంచి 40 శాతం ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ కులానికి చెందిన నాయకుడికి కాంగ్రెస్ కండువ కప్పేందుకు టీపీసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మున్నూరు కాపు సంఘంగా మంచి పేరు ప్రతిష్టలు ఉన్న నాయకుడితో మంతనాలు జరిగినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో అధికార పార్టీను ఢీకొట్టే సత్తా అతడికే ఉందని జిల్లా పార్టీ సైతం అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సదరు మున్నూరు కాపు సంఘం నాయకుడితో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి, పార్టీని ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు మున్నూరు కాపుసంఘంలో బలమైన నాయకుడిగా, సౌమ్యుడిగా పేరున్న అతడితోనే వివిధ మండలాలకు చెందిన ఆ సామాజిక నాయకులను కాంగ్రెస్‌లో లాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్న అతడి వల్ల ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని, న్యూటల్ ఓటర్లను సైతం ఆకర్షించవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ నాయకుడికి త్వరలోనే కాంగ్రెస్ కండువ కప్పేందుకు రెడీ అయినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News