యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : వెంకటేష్ ధోత్రే
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
దిశ, ఆసిఫాబాద్ : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆదివాసి భవన్ లో నిర్వహించిన యోగా దినోత్సవంలో డీపీవో బిక్షపతి, అడిషనల్ డీఎంహెచ్ వో సుధాకర్ నాయక్, డీటీడీవో రమాదేవి లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. యోగా చేయడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు నయమవుతా యని చెప్పారు. భారతదేశంలో ఉన్న యోగా ప్రాచుర్యాన్ని గుర్తించి అమెరికా. ఆస్ట్రేలియా లాంటి దేశాల పాఠశాలల్లో యోగా తరగతులు నిర్వహిస్తారని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుండి యోగ అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.