యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చు..: జిల్లా కలెక్టర్

మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం

Update: 2024-06-21 12:04 GMT

దిశ,ఆదిలాబాద్ : మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ తో పాటు జిల్లాలోని పలువురు అధికార యంత్రం తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా గురువు ఆధ్వర్యంలో పలు యోగాసనాలు వేసిన కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు, యువత, ప్రజా, ప్రతినిధులు యోగ ప్రాధాన్యతను వివరించారు. మానవ జీవితంలో దైనందిన కార్యక్రమాల్లో యోగా మిగతమై ఉంటుందని అన్నారు. యోగ వల్ల ఎలాంటి ఔషధాలు వేసుకోకుండా ఎన్నో రోగాలను దూరం చేస్తుందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆచార వ్యవహారాలు ఎంతగానో మారాయని,యోగ ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన దేశంగా భారతదేశం ఎంతో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఈ యోగ వల్ల శరీరంలోని అనేక వ్యాధులు దూరమవుతాయని, మానసిక ప్రశాంతత దొరుకుతుందని తెలియజేశారు. అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు యోగాలు చేయాలని, దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని కోరారు .ఇందులో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా వైద్య అధికారి నరేందర్ రాథోడ్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు,పలువురు యువతీ, యువకులు, ఇతర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అటు జిల్లావ్యాప్తంగా ఆయా మండల నియోజకవర్గం లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా కార్యక్రమాలలో భాగంగా ఉట్నూర్ లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, బోత్ నియోజకవర్గం లోని ఆయా మండల కేంద్రాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు, యువకులు స్థానికంగా యోగా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు యోగా ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని సూచించారు.








Similar News