అద్దె చెల్లించని ప్రభుత్వం..గురుకుల విద్యాలయాల గేట్లకు తాళాలు వేస్తామని సంఘం ప్రతినిధుల వెల్లడి

రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల ప్రైవేట్ భవనాలకు అద్దె చెల్లించలేదని

Update: 2024-10-14 15:42 GMT

దిశ, తాండూర్ : రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల ప్రైవేట్ భవనాలకు అద్దె చెల్లించలేదని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల విద్యాలయాల భవనాలకు ప్రభుత్వం నెలల చెల్లించవలసిన అద్దె బకాయిలు గత 9 నెలలుగా చెల్లించడం లేదని యజమానులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయ ప్రైవేట్ భవన యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇచ్చిన స్పందన కరువైందని యాజమాన్య సంఘం ప్రతినిధులు తెలిపారు.

అద్దె బకాయిలు చెల్లించడంలో సంబంధిత అధికారులు అనుసరిస్తున్న వైఖరికి విసిగి విద్యాలయాల భవనాలకు తాళాలు వేస్తామని నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వలన ఈ నెల 15 ఉదయం 8 గంటలకు గురుకుల విద్యాలయాల గేట్ లకు తాళాలు వేస్తామని యజమానుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించిన తరువాతనే తాళాలు తీయాలని రాష్ట్ర సంఘం ఒక ప్రకటనలో తెలిపారు.


Similar News