Collector Venkatesh Dhotre : విద్యార్థుల ఆరోగ్య పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

విద్యార్థుల ఆరోగ్య పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని

Update: 2024-08-27 13:05 GMT

దిశ,వాంకిడి : విద్యార్థుల ఆరోగ్య పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులను హెచ్చరించారు. మంగళవారం మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను డీటీడీ వో రమాదేవితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాలలోని రికార్డులు, స్టాక్ రూం వంట గదిని పరిశీలించారు. విద్యార్థుల తో మాట్లాడి వారి ప్రతిభను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

వానాకాలం సీజనల్ నేపథ్యంలో పారిశుద్ధ్యం లోపించకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం తో పాటు విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఉపాధ్యాయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు పిల్లలకు అర్థమయ్యేలా బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


Similar News