ఆర్థిక అక్షరాస్యత అవగాహణ సదస్సు
మండల కేంద్రంలోని గంగాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల అవరణలో ఆర్థిక అక్షరాస్యత పై గురువారం అవగాహన సదస్సును రవీంద్రనగర్ బ్రాంచ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
దిశ, చింతలమానేపల్లి : మండల కేంద్రంలోని గంగాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల అవరణలో ఆర్థిక అక్షరాస్యత పై గురువారం అవగాహన సదస్సును రవీంద్రనగర్ బ్రాంచ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృందం వారిచే బ్యాంక్ ద్వారా అందే పలు పథకాలు, సేవలను ఆట పాట, రూపంలో అవగాహణ కల్పించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ ఎస్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై రైతులు తమ ఖాతాల ద్వారా నగదు లావాదేవీలు జరపాలన్నారు.
పంట పెట్టుబడుల నిమిత్తం బ్యాంకు రైతులకు రుణాలిస్తుందని, పంట విక్రయించిన అనంతరం వచ్చిన డబ్బులు బ్యాంకుల్లో భద్రపర్చుకోవచ్చని తెలిపారు. సామాజిక భద్రత పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమ, ప్రధానమంత్రి సురక్షా భీమ యోజన, ఎస్బీఐ జనరల్ బీమా ఏడాదికి వెయ్యి, ఆటల్ పెన్షప్ యోజనలో 16 ఏండ్ల నుంచి 40 ఏండ్లలోపు యువకులు, రైతులు బీమా చేసుకోవాలన్నారు. డిజిటల్ లావాదేవీల పద్ధతులతోపాటు, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులు, బ్యాంకింగ్ ప్రాముఖ్యతపై ఖాతాదారులకు వివరించారు. ఈ సమావేశంలో మస్తాన్, రజిత లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాద్యాయులు, రైతులు విద్యార్ధులు పాల్గొన్నారు.