శిథిలావస్థలో బెజ్జూర్ తహసీల్దార్ కార్యాలయం..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్

Update: 2024-09-09 09:22 GMT

దిశ,బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థలో ఉంది. బెజ్జూర్ మండల కేంద్రంలో 2011 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 17 లక్షలతో బెజ్జూర్ తహసీల్దార్  కార్యాలయం నిర్మించింది. కార్యాలయంలోని ఫ్లోరింగ్ పూర్తిగా చెడిపోయింది.తహసీల్దార్   గది తో పాటు అన్ని గదులు శిథిలావస్తలో ఉన్నాయి. కార్యాలయానికి వచ్చే అధికారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఉన్నతాధికారులు వస్తున్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థలో మగ్గుతుంది. కార్యాలయం నిర్మించి 14 సంవత్సరాల అవుతున్న అధికారులు మరమ్మతులు చేపట్టడంలో అశ్రద్ధ వహిస్తున్నారని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బెజ్జూర్ తహసీల్దార్ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టాల్సిందిగా మండల వాసులు కోరుతున్నారు.


Similar News