Nirmal MLA : సకాలంలో ధాన్యం డబ్బులు అందించాలి

దిలావర్పూర్ మండలంలోని సాంగ్వి శివారులో శ్రీరామ్ సాగర్

Update: 2024-10-28 14:28 GMT

దిశ,దిలావర్పూర్ : దిలావర్పూర్ మండలంలోని సాంగ్వి శివారులో శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి చేప పిల్లలలను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వదిలారు. ముందుగా గోదావరి ఒడ్డున ఉన్న శ్రీ శ్రీ అన్నపూర్ణ పాప హరేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సభలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, ఆలయ కమిటీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి కి ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం చేప పిల్లలను వదులుతుందని ఆగస్టు నెలలో వదలాల్సిన చేప పిల్లలు అక్టోబర్ లో విడుదల చేయడంతో చాలా ఆలస్యమైందని మత్స్యకారులు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు . ప్రతి సంవత్సరం సప్లై చేస్తున్న దానిలో ఈ సారి సగం మాత్రమే సప్లై చేస్తున్నారని మత్సకారులు తెలిపారు.

సకాలంలో చేప పిల్లలను విడుదల చేసినట్లయితే జలాశయంలో నీరు ఎక్కువ ఉంటే చేప పిల్లలు చాలా ఎదుగుతాయని ఇప్పుడు విడుదల చేయడం వల్ల జలాశయంలో నీరు తగ్గి చేపల ఎదుగుదల సరిగా ఉండదని ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని మత్స్యకారులకు హామీ ఇచ్చారు.ఈ సంవత్సరానికి గాను సుమారు 32 లక్షల చేపపిల్లలను జలాశయంలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా,మండల అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

దిలావర్పూర్ మండలంలోని బన్సీ పల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించాడు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో ధాన్యం డబ్బులు అందించాలని తెలిపారు. ఏ గ్రేడ్ వడ్లకు రూ. 2320,బి గ్రేడ్ వద్దకు రూ.2300 అందించడం జరుగుతుందని కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోధుమలకు తరలించాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో తాసిల్దార్ స్వాతి,ఎంపీడీవో అరుణ రాణి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో సుకుమార్, బాన్సపల్లి తాజా మాజీ సర్పంచ్ పోలా పద్మ విక్రం, నాయకులు ముత్యంరెడ్డి, సత్యం చంద్రకాంత్, వీరేష్ కుమార్, మధుకర్, సత్యనారాయణ గౌడ్ రైతులు పాల్గొన్నారు.


Similar News