Former Minister Jogu Ramanna : రైతులు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వ్యతిరేక విధానాలను

Update: 2024-10-28 13:16 GMT

దిశ, ఆదిలాబాద్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారికి పూర్తిగా అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.బేలా మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల వైఖరిని ఎండగట్టారు. రాత్రికి రాత్రి గంపగుత్త విధానం లో ప్రైవేట్ వ్యాపారులతో లోపాయికారి ఉప్పందం కుదుర్చుకొని, కొనుగోలు నిర్వహించడమే కాక..తేమ శాతం సాకుగా చూపుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. దీపావళి పండగ పూట రైతుల జీవితాలను చీకటిమయం చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగదన్నారు.. రైతు సంఘం నాయకులు, రైతుల సమక్షంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించాల్సిన సమావేశాలను చీకటి ఒప్పందంలో నిర్వహించడం తగదన్నారు.

స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బీజేపీ నాయకులున్నప్పటికి సీసీఐ ద్వారా రైతులకు ధర కల్పించడంలో విఫలం చెందారన్నారు. కనీసం కమర్షియల్ పర్చేస్ అనుమతులు తీసుకోలేని పరిస్థితిలో ఎంపీ ఎమ్మెల్యే విఫలమవుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ పత్తి నాణ్యతలో వేరే రాష్ట్రాల కంటే ముందు ఉన్నప్పటికిని ఆదిలాబాద్ పత్తికి ధర కల్పించడంలో ఎందుకు వెనకబడుతున్నరని ప్రశ్నించారు.కనీసం రాష్ట్ర ప్రభుత్వం కూడా పత్తి తో పాటు ఇతర పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి,మోసం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. హర్యానా, పంజాబ్ ,గుజరాత్ కంటే నాణ్యమైన పత్తి ఆదిలాబాదేనని వాటి సరసన ఆదిలాబాద్ కూడా పత్తి ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రైతు సంఘం నాయకులు, రైతుల, కలెక్టర్ సమక్షంలో ధరను కల్పించినట్లయితే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ మనోహర్,నాయకులు,సతీష్ పవర్,గంభీర్ టాకరే,ప్రమోద్ రెడ్డి,తన్వేర్ ఖాన్, తేజ రావు, దేవన్న, మంగేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News