ప్రసవ వేదనతో మనమ్మ రోదన.. వైద్య సిబ్బంది లేక అంబులెన్స్‌లోనే

నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడం తల్లికి ఒక ఎత్తు అయితే.. వేమనపల్లి మండలంలో మాత్రం గర్భిణీ స్త్రీలు ప్రసవించడం మరొక ఎత్తుగా చెప్పవచ్చు.

Update: 2022-12-01 14:50 GMT

దిశ, వేమనపల్లి : నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడం తల్లికి ఒక ఎత్తు అయితే.. వేమనపల్లి మండలంలో మాత్రం గర్భిణీ స్త్రీలు ప్రసవించడం మరొక ఎత్తుగా చెప్పవచ్చు. ఒక మహిళ మాతృమూర్తిగా మారాడానికి ఎన్నో నొప్పులను ఓర్చుకొని తన ప్రాణం పోతున్న పట్టించుకోకుండా ఒక బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది. కానీ వేమనపల్లి మండలంలో నిరుపేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షల మారింది. స్వరాష్ట్రంలో ప్రజల జీవన విధానం మారి విద్యా, వైద్యం ఉచితంగా అందాల్సి ఉన్నా.. వైద్య శాఖ నిర్లక్ష్యం వల్ల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు సరియైన వైద్యం అందడం లేదు.

గర్భిణీ స్త్రీలకు సరైన వైద్యం అందక ప్రసవ సమయంలో మృతి చెందిన గర్భిణీలు ఎందరో ఉన్నారు. మండలంలోని జాజులపేట గ్రామానికి చెందిన కుబిడే మనమ్మ గురువారం అర్ధరాత్రి సమయంలో పురిటి నొప్పులు ఎక్కువ రావడంతో అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను ప్రసవం కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి వైపు తీసుకెళ్లారు. పురిటి నొప్పులు ఎక్కువ కావడం.. రహదారి పొడవున అటవీ మార్గం కావడంతో వైద్యులెవరు లేకుండానే ఆమె ఆంబులెన్స్‌లోనే ప్రసవించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రసవించిన ఆ తల్లికి ఈఎన్టి ప్రవీణ్ వైద్యాన్ని అందించారు.

ఇదిలా ఉంటే.. గతంలో వైద్యం అందక చామనపల్లి గ్రామానికి చెందిన జమ్మిడి నిర్మల పురిటి నొప్పులతోనే తల్లి బిడ్డ మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. మారుమూల ప్రాంతం కావడంతో సమయానికి ఆసుపత్రికి రాకపోవడంతో వైద్యులు ప్రజలకు వైద్యాన్ని అందించలేకపోతున్నారు. దీంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న వైద్య ఆరోగ్య శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. వైద్యుల కొరత కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓకే వైద్యుడు సేవలను అందిస్తున్నాడు. మారుమూల ప్రాంతాల్లో రహదారులు సక్రమంగా లేకపోవడంతో, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొరత కారణంగా ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యవసర సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరు లేకపోవడంతో ప్రజలు తమ పాణాలను అరచేతిలో పెట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు ఆసుపత్రులలో డబ్బులు పోసి, అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా స్థాయిలో ఉన్న వైద్యాధికారులకు చలనం కలగడం లేదు గ్రామీణా ప్రాంతబినేరు పేద ప్రజల పట్ల వివక్ష చూపడం తోనే మండల వాసులకు సరైన వైద్యం అందడం లేదు.

Tags:    

Similar News