218 గ్రాముల గంజాయి పట్టివేత..
జన్నారం మండల కేంద్రంలోని నేతుల నాగరాజు అనే వ్యక్తివద్ద 218 గ్రాముల గంజాయిని రామగుండం టాస్క్ పోర్స్ ఎస్సై అశోక్, మదుసూదన్ రావులు బుధవారం మద్యాహ్నం పట్టుకున్నారు.
దిశ, జన్నారం : జన్నారం మండల కేంద్రంలోని నేతుల నాగరాజు అనే వ్యక్తివద్ద 218 గ్రాముల గంజాయిని రామగుండం టాస్క్ పోర్స్ ఎస్సై అశోక్, మదుసూదన్ రావులు బుధవారం మద్యాహ్నం పట్టుకున్నారు. జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రామగుండం సీపీ టాస్క్ ఫోర్స్ సీఐ అశోక్, ఎస్సై మధుసూదన్ తమ సిబ్బందితో కలిసి జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న నేతుల నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం తనిఖీ చేయగా అతడి వద్ద 218 గ్రాముల గంజాయి దొరికిందన్నారు. అతడిని విచారించగా అతడు లొతొర్రె గ్రామానికి చెందిన పటేల్ అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు జన్నారం చుట్టు పక్కల వున్నా గ్రామాలలో అమ్ముతున్నానని తెలిపాడు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకోని అతడి వద్దగల గంజాయి, ఒక సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. పటేల్ అనే వ్యక్తి పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నావారిలో సిబ్బంది జె.రాజు, శ్రీనివాస్, శ్రీధర్ లు ఉన్నారు.