మితి మీరిన వేగంతోనే ఇలాంటి యాక్సిడెంట్స్.. సజ్జనార్ ట్వీట్ వైరల్ (వీడియో)

కర్ణాటకలోని మంగళూరులో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

Update: 2023-10-19 07:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని మంగళూరులో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. మితిమీరిన అతివేగం, అజాగ్రత్తే ఇలాంటి ఘోర ప్రమాదాలకు కారణమన్నారు. వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..