జైలు నుంచి విడుదలైన మావోయిస్టు అగ్రనేత

బస్తర్​జైలు నుంచి మావోయిస్టు అగ్రనేత గోపన్న విడుదలయ్యారు. 1980లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై పార్టీ

Update: 2023-03-26 16:05 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బస్తర్​జైలు నుంచి మావోయిస్టు అగ్రనేత గోపన్న విడుదలయ్యారు. 1980లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై పార్టీలో చేరిన గోపన్న ఛత్తీస్ ఘడ్​– ఒడిషా జోనల్​కమిటీ అధ్యక్షుడిగా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేశారు. వేర్వేరు పోలీస్​స్టేషన్లలో గోపన్నపై 18 పైగా కేసులు ఉన్నాయి. 2006లో గోపన్నను అరెస్టు చేసిన పోలీసులు అతనిపై కోర్టులో ఛార్జీషీట్​దాఖలు చేశారు. అయితే, నేరాలను నిరూపించటంలో విఫలమయ్యారు. ఈ క్రమంలోనే గోపన్న జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన సొంత జిల్లా నల్గొండ కావటం గమనార్హం.

Tags:    

Similar News