ఢిల్లీ లిక్కర్ స్కామ్: కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న ఐదుగురు ఈడీ అధికారుల బృందం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం 11 గంటలకు దర్యాప్తుకు హాజరైన కవితను ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. ఐదుగురు ఈడీ అధికారుల బృందం ఎమ్మె్ల్సీ కవితను ప్రశ్నిస్తోంది. సౌత్ గ్రూప్ ఫండింగ్‌పై కవితను అధికారులు క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్ర పిళ్లై, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు కవితను కలిపి ఒకేసారి ముగ్గురిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఇక, కవిత విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. కవితకు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈడీ ఆఫీస్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఈడీ కార్యాలయం పరిసరా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కేంద్ర బలగాలను రంగంలోకి దింపి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.