వీధికుక్కలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి.. TPCC ఉపాధ్యక్షుడు జి. నిరంజన్

తెలంగాణాలో గత కొన్ని రోజులుగా వీధికుక్కల దాడులు ఎక్కువైన సంగతి గుర్తుండే ఉంటుంది.

Update: 2024-08-10 14:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణాలో గత కొన్ని రోజులుగా వీధికుక్కల దాడులు ఎక్కువైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో వీధికుక్కలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల బెడద నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిరంజన్ విజ్ఞప్తి చేశారు

వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో నవజాత శిశువును వీధికుక్కలు తిన్న ఘటనపై టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ మాట్లాడుతూ.. 'రోజు రోజుకి కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని , వీధికుక్కల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయమైన వారికీ రూ.50 వేల నుంచి రూ.లక్ష చెల్లించాలని' నిరంజన్ శనివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. కాగా వీధికుక్కల దాడి ఘటనలపై హైకోర్టు ఆగస్టు 2న ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ అన్నారు.


Similar News