దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మందుబాబులకు (Bad News for Liquor Lovers) షాక్ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులకు లిక్కర్ సరఫరా (Liquor Supply) ఆగిపోయింది. దీనికి కారణం సాంకేతిక సమస్యలేనని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సర్వర్ సమస్య తలెత్తడంతో ఐఎంఎఫ్ఎల్ డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రాత్రిలోపు సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.