Shocking: ఇంటి అద్దె కట్టలేదని కత్తితో దాడి.. ఆ తర్వాత...

ఇంటి అద్దె కట్టలేదని ఓ యజమాని అద్దెకుంటున్న యువతిపై కత్తితో దాడి చేసిన దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

Update: 2024-11-11 05:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంటి అద్దె కట్టలేదని ఓ యజమాని అద్దెకుంటున్న యువతిపై కత్తితో దాడి చేసిన దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అత్తాపూర్‌ పరిధిలోని హసన్ నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు తన కుటుంబంతో సహా స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకుంటోంది. అయితే కొద్ది నెలలుగా ఆమె అద్దె కట్టకపోవడంతో ఓనర్ కరెంట్ కట్ చేశాడు. ఈ విషయంలో అద్దెకు ఉంటున్న కుటుంబానికి, యజమానికి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి లోనైన యజమాని ఆ కుటుంబంపై కత్తితో దాడి చేయడంతో ఆ కుటుంబంలోని యువతికి గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన కుటుంబీకులు స్థానిక పోలీస్ట్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Similar News