కుక్కలు, కోతుల బెడద.. నివారణకు వినూత్న ప్రయోగం

కుక్కలు, కోతుల దాడులను నివారించేందుకు వైరా మండలంలోని పాలడుగు గ్రామ పంచాయతీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

Update: 2023-02-25 05:44 GMT

దిశ, వైరా : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన కుక్కలు, కోతుల దాడులను నివారించేందుకు వైరా మండలంలోని పాలడుగు గ్రామ పంచాయతీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రామంలో కోతులతో పాటు కుక్కల బెడదను తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుక్కలు, కోతుల బెడద వల్ల చిన్నారులు, మహిళలు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతం. దీంతో పాలడుగు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గ్రామంలోని పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ తెల్లూరు రాజేష్‌కు ఎలుక బంటి వేషధారణ ధరింప జేసి గ్రామంలో అతడిని తిప్పుతున్నారు. ఎలుగుబంటి వేషధారణలో ఉన్న రాజేష్‌ని చూసిన కుక్కలు, కోతులు భయభ్రాంతులకు గురై గ్రామం నుంచి పరారవుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న పైర్ల‌లోని కంకులను కోతులు ఆగం చేయకుండా ఇదే విధానాన్ని రైతులు అవలంభిస్తున్నారు. ఎలుగుబంటి వేషధారణతో కోతులు, కుక్కల బెడద నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని పాలడుగు గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News