పల్సర్ సోలార్ బైక్! సౌర‌శక్తితో రయ్.. రయ్.. నల్గొండవాసి అద్భుత సృష్టి

టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు.. పెద్ద పెద్ద చదువులు లేని వ్యక్తులు సైతం ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించారు.

Update: 2024-06-01 10:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు.. పెద్ద పెద్ద చదువులు లేని వ్యక్తులు సైతం ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ వాసి ఓ అద్భుతాన్ని క్రియేట్ చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు చేసే పని అతను చేసి చూపించాడు. చమురు, పెట్రోల్ ధరలు మండిపోతున్న వేళ.. సౌరశక్తితో నడిచే బైక్‌ను తయారు చేశాడు. పైసా ఖర్చు లేకుండా ప్రయాణాన్ని సౌరశక్తితో సాగిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండకు చెందిన మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి వెల్డింగ్ షాప్ మెకానిక్. కొన్నేండ్లుగా వాడుతున్న తన పల్సర్ బైక్ ఇంజన్ పూర్తిగా పాడైపోయింది. దాన్ని బాగు చేయించాలంటే ఖర్చు బాగా పెట్టాల్సి వస్తుంది.

మరోవైపు పెట్రోల్ ధరలు.. మైలేజ్ కూడా తక్కువగానే రావడంతో ఆయనకు ఓ వినూత్న ఆలోచన కలిగింది. సౌరశక్తితో నడిచే బైక్ తయారు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే నెలలు శ్రమించి తన బైక్ ప్రయోగం మొదలు పెట్టారు. పాడైన ఇంజన్లను పక్కన పెట్టి దాని స్థానంలో 12 వోల్టులు కలిగిన నాలుగు బ్యాటరీలు అమర్చారు. బ్యాటరీల కోసం రూ. 30 వేల వరకు ఖర్చు అయిందట. అయితే బ్యాటరీలు 4 గంటల రీచార్జ్‌తో కేవలం 40 కీలోమీటర్ల దూరం వరకే వెళ్తుందని, దీంతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అదే బైక్‌పై ఓ సోలార్ ప్లేట్ ఏర్పాటు చేశారు. ఇందుకు మరో రూ. 10 ఖర్చు వచ్చిందట. దీంతో మొత్తం రూ. 40 వేల ఖర్చుతో సౌరశక్తి పల్సర్ బైక్ తయారు చేసి రయ్.. రయ్ మంటూ వీధుల్లో తిరుగుతున్నారు.

Tags:    

Similar News