నగరం నడిబొడ్డున మైనర్ బాలిక మీద ఘోరం.. కాల్చి చెత్త కుప్పలో పడేశారు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల మైనర్ బాలికను హత్య చేసి తగలబెట్టి చెత్తకుప్పలో పడవేయగా పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యం

Update: 2024-06-17 13:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల మైనర్ బాలికను హత్య చేసి తగలబెట్టి చెత్తకుప్పలో పడవేయగా పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యం.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం లక్ష్మా తండాకు చెందిన ఓ నిరుపేద కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉంటున్నారు.

ఈనెల 7న వారి పెద్ద కుమార్తె (12) కిరాణా షాపు వద్దకు వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా చుట్టుపక్కల ప్రాంతాలు వెతకగా చివరికి వారం రోజుల తర్వాత చెత్తకుప్పలో తగలబెట్టి పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం గుర్తించారు. కాగా, పోలీసులు అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ బిడ్డ దక్కేదని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలిక తప్పిపోయి వారం రోజులైనా పోలీసుల నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News