హైదరాబాద్ లో వెలుగు చూసిన మరో భారీ మోసం.. 4 వేల మందికి బురిడీ
హైదరాబాద్ లో మరో మోసం వెలుగు చూసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించిన ఘటన కలకలం రేపుతున్నది. ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో పెట్టుబడులు పెడితే భారీగా వడ్డీతో పాటు కొందరికి ప్లాట్లను కూడా ఇప్పిస్తామని ఇస్తామని ఫౌండేషన్ చైర్మన్ కమలాకర్ శర్మ తో పాటు నిర్వాహకులు ప్రజలను నమ్మించారు. వీరి మాటలను నమ్మిన ప్రజలు అధిక వడ్డీ ఆశతో భారీ ఎత్తున డిపాజిట్లు చేశారు. ఇలా ఫౌండేషన్ పేరుతో 514 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు తెలుస్తోంది. తీర మోసపోయామని గ్రహించిన బాధితులు రెండు నెలల క్రితమే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో కమలాకర్ శర్మను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా తాజాగా వీరి బారిన పడిన 4 వేల మంది బాధితులతో సోమవారం సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.