అమ్మతనం చాటుకున్న కానిస్టేబుల్
ఎస్సై పరీక్షా కేంద్రంలో ఓ మహిళ ఆ కానిస్టేబుల్ మానవత్వం చాటుకుంది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసులంటే కరకుగా ఉంటారు.. వాళ్లకు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు అని కొంతమంది ఆరోపిస్తుంటారు. కానీ వాళ్లకు కూడా మంచి మనసు ఉంటుందని అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్ అమ్మతనాన్ని చాటుకుంది. ఎస్ఐ పరీక్ష రాయడానికి ఓ అభ్యర్థి చంటి బిడ్డతో రాగా పరీక్ష పూర్తయ్యేంత వరకు ఆ మహిళా కానిస్టేబుల్ ఆ చిన్నారిని లాలించి ఆడించింది. ఈ సంఘటన గండిపేట ఎంజీఐటీ కాలేజీ సెంటర్లో జరిగింది.
ఎస్ఐ పోస్టులను భర్తీ చేయటానికి పోలీస్రిక్రూట్మెంట్ బోర్డు శని, ఆదివారాల్లో పరీక్షలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖిల అనే అభ్యర్థి పరీక్ష రాయటానికి ఎంజీఐటీ కాలేజీకి తన రెండు నెలల పసికందును వెంట తీసుకొచ్చింది. దాంతో కానిస్టేబుల్కన్యాకుమారి ఆ చిన్నారిని పరీక్ష ముగిసే వరకు తన వద్దనే ఉంచుకుంది. లాఠీలు ఝళిపించటమే కాదు అవసరమైతే మానవత్వంతో కూడా స్పందిస్తామని చాటిందా లేడీ కానిస్టేబుల్.