ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: చంచల్‌గూడ జైలు నుంచి నిందితులు విడుదల

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజీలు గురువారం ఉదయం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు.

Update: 2022-12-08 02:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజీలు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. ఇక ఈ కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో BL సంతోష్, తుషార్, శ్రీనివాస్‌ను నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది. దీనిపై నిన్న ఏసీబీ కోర్టు విచారణ చేపట్టి కొట్టివేసింది. కాగా, ఇటీవల ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Also Read....

కీర్తించడంతో సరిపెట్టి.. తీవ్ర నిరాశను మిగిల్చిన సీఎం కేసీఆర్!


Similar News