కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

షాద్ నగర్ పట్టణంలోని బైపాస్ రహదారి చర్చ్ సమీపంలో ప్రయాణిస్తున్న షిఫ్ట్ డిజైర్ కార్ అగ్నికి ఆహుతి అయింది.

Update: 2023-03-02 05:24 GMT

దిశ, షాద్ నగర్ : షాద్ నగర్ పట్టణంలోని బైపాస్ రహదారి చర్చ్ సమీపంలో ప్రయాణిస్తున్న షిఫ్ట్ డిజైర్ కార్ అగ్నికి ఆహుతి అయింది. మహబూబ్ నగర్‌కు చెందిన కొంతమంది షిఫ్ట్ కారులో హైదరాబాద్ నుండి జడ్చర్లకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు సురక్షితంగా తప్పించుకున్నారు. లేకపోతే ఘోర ప్రమాదమే జరిగేది. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా సకాలంలో రాలేదని బాధితులు వాపోతున్నారు.

Tags:    

Similar News