తన రక్తంతో పాలకూర్తి ఎమ్మెల్యే యశస్విని ఫోటో గీయించిన కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్త

కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తైన లోడంగి అశోక్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఫొటోను తన రక్తంతో గీయించారు.

Update: 2024-06-25 09:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తైన లోడంగి అశోక్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఫొటోను తన రక్తంతో గీయించారు. జనగాం జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన అశోక్ తన రక్తంతో యశస్విని చిత్రం గీయించి తనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మేరకు లోడంగి అశోక్ ఆదివారం పాలకుర్తి మిషన్ భగీరథ గెస్ట్ హౌస్‌లో యశస్విని మర్యాదపూర్వకంగా కలిసి చిత్రపటాన్ని అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో యాకస్వామి, నరేందర్, సాత్విక్ పటేల్, నల్ల శ్రీరాములు, రాజేష్, నాగరాజు పాల్గొన్నారు. ఇక మామిడాల యశస్విని రెడ్డి తెలంగాణ శాసనసభకు అతిపిన్న వయసులో ఎన్నికవ్వడం విశేషం. కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎన్నికయ్యారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావునే ఓడించి రికార్డు సృష్టించారు. ఎర్రబెల్లిపై 47, 132 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎంపికైన అతి చిన్న వయస్కురాలిగా యశస్విని నిలిచారు.

 


Similar News