ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్ల కలకలం

ఢీల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద మంగళవారం తెలంగాణ రైతు భరోసా పై వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి.

Update: 2025-01-07 16:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢీల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద మంగళవారం తెలంగాణ రైతు భరోసా పై వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద యూటర్న్ సీఎం అంటూ ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి రూ.15000 ఇస్తామని ప్రకటించారని, కానీ కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఒక్క రూపాయి విడుదల చేయలేదని ఆ పొస్టర్లలలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకుంటూ ఎకరాకు రూ. 15000 ఇవ్వమని, రూ. 12000 మాత్రమే ఇస్తామని ప్రకటించారంటూ ఏకంగా ఢీల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందే పోస్టర్లు వెలవడం కలకలంరేపుతుంది. అయితే ఇది ఎవరి పని అనేది మాత్రం తెలియరాలేదు.


Similar News