‘దిశ’ వరుస కథనాలకు స్పందించిన అధికారులు.. కబ్జా దారులపై కేసు నమోదు

ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న పలువురిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.

Update: 2023-04-04 04:43 GMT

దిశ, పేట్ బషీరాబాద్: ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న పలువురిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్ పరిధిలో ఉన్న సర్వేనెంబర్ 25/1 లో కొంతమంది అక్కడ ఉన్న ప్రభుత్వ క్వారీ గుంతలను టిప్పర్లతో మట్టి వ్యర్ధాలను తెచ్చి పూడ్చి కభాలించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సంపంగి సురేష్ అతని అనుచరులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కుత్బుల్లాపూర్ ఆర్ఐ రేణుక ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై తర్జనభర్జన..

వాస్తవంగా మార్చి 25న సర్వే నెంబర్ 25/1లో కబ్జాయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత పత్రాన్ని రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. దాన్ని మార్చి 27న పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చినప్పటికీ ఆ విధంగా జరగలేదు. దీంతో ‘దిశ’ పత్రికలో "క్వారీ గుంతలు కబ్జా", "ఫిర్యాదులకే పరిమితం చర్యలు శూన్యం", "అగ్గువకే సర్కారు భూములు విక్రయం" శీర్షికలతో 25/1 కబ్జా ఉదాంతాలను వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో అనేక తర్జన భర్జనలు అనంతరం ఫిర్యాదు విషయంలో కదలిక వచ్చింది. ఎట్టకేలకు రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కబ్జాదారుల పై కేసు నమోదయింది. సంపంగి సురేష్ అనే వ్యక్తి అతని అనుచరులతో లారీ నెంబర్ ఏపీ 37 టిడి 5188, కే ఏ 35 బి 8657 లారీలలో మట్టి వ్యర్ధాలను తెచ్చి క్వారీ గుంతలను పూడుస్తున్నారని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.



 


Tags:    

Similar News