ఎలక్షన్ ఎఫెక్ట్: బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను బీజేపీ కార్పొరేటర్‌తో పాటు మరో వ్యక్తిపై ఐఎస్ సదన్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను బీజేపీ కార్పొరేటర్‌తో పాటు మరో వ్యక్తిపై ఐఎస్ సదన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు ఇద్దరికి సీఆర్పీసీ 41(ఏ) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణాధికారి లేదా కోర్టులో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్‌రెడ్డి, తన అనుచరుడైన శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంగళవారం చంపాపేట మారుతీనగర్ స్ట్రీట్ నెంబర్1లో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇది గమనించిన ఎన్నికల అధికారి బాగల్కోట్ శ్రీకాంత్ ఐఎస్ సదన్ పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో మారుతీనగర్ వెళ్లిన పోలీసులు అక్కడ జరిపిన విచారణలో వంగా మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇంటింటి ప్రచారం చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిపై ఐపీసీ 341, 188, 171(హెచ్), సీపీ యాక్ట్ సెక్షన్21/76 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇద్దరికి సీఆర్పీసీ యాక్ట్ సెక్షన్41(ఏ) ప్రకారం నోటీసులు జారీ చేశారు. కేసును సీఐ మల్లేష్దర్యాప్తు చేస్తున్నారు.
Read More..