వామ్మో.. బైక్స్ బయట పార్క్ చెయ్యోద్దు! నగరంలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ

హైదరాబాద్ బాలాపూర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకుని బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2024-08-31 06:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ బాలాపూర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకుని బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ చోరీకి సంబంధించిన సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో స్థానికులు బండి బయట పార్క్ చేస్తే.. ఎక్కడ చోరీకి గురవుతుందోనని జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ సీసీ ఫుటేజ్ వీడియోలు వైరల్‌గా మారాయి.

వీడియోలో ఉన్న ప్రకారం.. రాత్రి సమయంలో ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్‌ల వద్దకు వచ్చాడు. అటు ఇటు చూస్తూ.. రెండు బైక్‌లను తన వద్ద ఉన్న నకిలీ కీ తో స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కన్పిస్తుంది. చివరికి ఒక బైక్ స్టార్ట్ చేసుకుని తన సొంత బైక్‌లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. వామ్మో.. బయట బైక్స్ బయట పార్క్ చెయ్యొద్దు ఇంకా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తెలివిగా బైక్ తస్కరించుట అని కొంతమంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News