బ్రేక్ ఫెయిలై అదుపుతప్పిన బస్సు.. 9 మంది విద్యార్థులకు తీవ్ర గాయలు

రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది.

Update: 2024-08-06 13:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు తొమ్మిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 20 విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం గాయపడిన విద్యార్థులు అందరినీ హైదరాబాద్‌లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News