70 లక్షల విలువ చేసే.. పత్తి విత్తనాలు సీజ్

రాచకొండ పోలీసులు పెద్ద మొత్తంలో నాసిరకం పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

Update: 2023-06-01 06:31 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాచకొండ పోలీసులు పెద్ద మొత్తంలో నాసిరకం పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరిని అరెస్ట్ చేసారు. మహారాష్ట్ర నుంచి ఓ ముఠా తెలంగాణలో నిషేధంలో ఉన్న పత్తి విత్తనాలను తీసుకు వస్తున్నట్టు ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ క్రమంలో ఎస్వోటీ సిబ్బంది, చౌటుప్పల్ పోలీసులతో మాటు వేసి విత్తనాలతో వస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 70 లక్షల రూపాయల విలువ చేసే 2.2 టన్నుల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఈరోజు సాయంత్రం రాచకొండ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Tags:    

Similar News