70 అడుగుల ఖైరతాబాద్ బడా గణేష్ నమూనా విడుదల.. ఈ సారి ఏ అవతారమంటే..?
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ఆదిదేవుడి స్వరూపం నమూనాను విడుదల చేసింది.
దిశ, ఖైరతాబాద్ : ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ఆదిదేవుడి స్వరూపం నమూనాను విడుదల చేసింది. ఈసారి ‘సప్తముఖి మహా శక్తి గణపతి’గా భక్తులకు వినాయకుడు దర్శనం ఇవ్వనున్నారు. ఇక్కడ గణేషుడిని నిలబెట్టడం 70 సంవత్సరాలను పురస్కరించుకొని 70 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా దర్శనమీయనున్న ఖైరతాబాద్ గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.