TGSRTC : సంక్రాంతికి 6 వేల ప్రత్యేక బస్సులు : టీజీఎస్ఆర్టీసీ

సంక్రాంతి పండుగ(Sankranthi Festival) సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Update: 2025-01-04 14:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ(Sankranthi Festival) సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. మహాలక్ష్మీ పథకం(Mahalaxmi Scheme)లో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లెవెలుగు, ఎక్స్​ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. రోజు వారీగా నడిపే బస్సుల్లో అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. కానీ పండుగ సందర్భంగా నడిపే అదనపు సర్వీసు బస్సులకు మాత్రం 50 శాతం అదనంగా ఛార్జీలు ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. 

Tags:    

Similar News