గ్రూప్-1కు 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగుల దరఖాస్తు

దిశ, తెలంగాణ బ్యూరో : సమైక్య రాష్ట్రంలో 2001లో గ్రూప్-1 నోటిఫికేషన్‌లో 312 పోస్టులకు సుమారు మూడు లక్షల దరఖాస్తులు.. latest telugu news

Update: 2022-06-05 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సమైక్య రాష్ట్రంలో 2001లో గ్రూప్-1 నోటిఫికేషన్‌లో 312 పోస్టులకు సుమారు మూడు లక్షల దరఖాస్తులు వస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత వెలువడి మొట్టమొదటి నోటిఫికేషన్‌లో 503 పోస్టులకు 3,80,282 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 2వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైతే తొలి 15 రోజుల్లో సగటున ప్రతి రోజు 8 వేల అప్లికేషన్ల చొప్పున 1.26 లక్షలు వస్తే మే 31న చివరి తేదీగా తొలుత ప్రకటించడంతో చివరి రెండు రోజుల్లో సగటున రోజుకు 42,500 చొప్పున వచ్చాయి. ఆ తర్వాత గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగించడంతో ఈ నెల నాలుగు రోజుల్లో 28,559 అప్లికేషన్లు వచ్చాయి.

మొత్తం 3.80 లక్షల దరఖాస్తుదారుల్లో 2,28,951 పురుషులుకాగా 1,51,192 మంది మహిళలు. ట్రాన్స్ జెండర్లు కూడా 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుదారుల్లో గరిష్టంగా 2,28951 మంది గ్రాడ్యుయేట్లు కాగా, 1,22,826 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు. ఎంఫిల్ చేసినవారు 424 మంది, పీహెచ్‌డీ డాక్టరేట్లు 1,681 మంది ఉన్నారు. దివ్యాంగులు కూడా 6,106 మంది ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తొలి రెండు వారాల్లో పెద్దగా స్పందన లేకపోయినా ఆ తర్వాత రెండు వారాల్లో మాత్రం రోజుకు సగటున 10,769 చొప్పున 1.40 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొంది. కేవలం మే 30, 31 తేదీల్లో 85 వేల అప్లికేషన్లు వచ్చాయని తెలిపింది.


Similar News