శబరిమలకు 38 ప్రత్యేక రైళ్లు..

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-11-26 01:57 GMT

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప మాలదారులు, భక్తులను దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 38 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కొల్లాంకు డిసెంబర్ 5,12,19,26 తేదీల్లో రైళ్లను నడపనున్నారు. కొల్లాం నుంచి హైదరాబాద్ కు వచ్చే వారి కోసం డిసెంబర్ 6, 13, 20, 27 జనవరి 3, 10, 17 తేదీల్లో రైళ్లను నడుపుతారు. నర్సాపూర్ నుంచి కొట్టాయంకు డిసెంబర్ 2, 9, 16, 30 జనవరి 6, 13 తేదీల్లో రైళ్లు నడవనున్నాయి. కొట్టాయం-నర్సాపూర్ డిసెంబర్ 3, 10, 17, 24, జనవరి 7, 14 సికింద్రాబాద్ - కొట్టాయం డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 కొట్టాయం - సికింద్రాబాద్ డిసెంబర్ 4, 11, 18, 25 జనవరి 2, 9 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

READ MORE

నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Tags:    

Similar News