తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు

తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో త్వరలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.

Update: 2024-09-25 05:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో త్వరలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల ఉమ్మడి గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానం పదవి కాలం వచ్చే మార్చి 29 తేదీతో ముగియనుంది. ఆ మూడు స్థానాలకు సంబంధించి కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 30న రాష్ట్ర ఎన్నికల అధికారి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్ 6 వరకు ఆన్ లైన్ ద్వారా ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23న ముసాయిదా ఓటర్ జాబితా, ఫిర్యాదుల పరిష్కరించేందుకు తుది గడువు డిసెంబర్ 25 గా నిర్ణయించారు. డిసెంబర్ 30న తుది జాబితాను ప్రకటిస్తారు.

శాసనమండలిలో మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సిగా ఉన్న టీ. జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉన్న కూర రఘోత్తం రెడ్డి, (మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్), అలుగుబెల్లి నర్సిరెడ్డి (వరంగల్ -ఖమ్మం-నల్లగొండ) పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. ఈ తేదీ నాటికి వీరి స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.


Similar News