T- టీడీపీ రాష్ట్ర కార్యవర్గంలో మరో 28 మందికి చోటు
టీ టీడీపీ రాష్ట్ర నూతన కార్యవర్గంలో మరో 28 మందికి చోటు కల్పించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: టీ టీడీపీ రాష్ట్ర నూతన కార్యవర్గంలో మరో 28 మందికి చోటు కల్పించారు. బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. పార్టీ చేనేత విభాగం అధ్యక్షుడుగా బడుగు దానయ్య (భువనగిరి), తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముంజా వెంకట రాజంను (స్టేషన్ ఘనపూర్) నియమించారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గం సభ్యుల సంఖ్య 61కి చేరింది. సీనియారిటీ, పనితీరు, ప్రాంతాలు, ఇతర సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరిస్తామని, అర్హులైన నాయకులను పార్టీ అనుబంధ విభాగాల పదవులలో నియమిస్తామని అన్నారు.
పార్టీ బలోపేతం కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పీ.చంద్రయ్య, ప్రధాన కార్యదర్శులుగా ఆజ్మీరా రాజు నాయక్, గడ్డి పద్మావతి, బండారి వెంకటేష్, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా బిల్డర్ ప్రవీణ్, మ్యాడమ్ రామేశ్వర్ రావు, డాక్టర్ ఏఎస్ రావు, ముప్పిడి గోపాల్, సూర్యదేవర లత, కార్యనిర్వాహక కార్యదర్శులుగా గాంధీ, సుజాత, ప్రకాష్ ముదిరాజ్, జి.జగదీష్ యాదవ్, మండూరి సాంబశివరావు, పుట్టి రాజు, బిక్షపతి ముదిరాజ్, లీలా పద్మ, కార్యదర్శులుగా నిమ్మకాయల ఏడు కొండలు, ఎండీ ఇమాం, పీ,నందకిశోర్, రాజేంద్రప్రసాద్, ఎం.రాజు, జీలమోని రవిందర్, రాపోలు నర్సింహులు, బయ్య నారాయణ, సుతారపు వెంకట నారాయణ , ఎం.రాజు, తలారి శ్రీకాంత్ నియామకం అయ్యారు.
Also Read..
ORRను కేసీఆర్, కేటీఆర్ ముంబై కంపెనీకి తెగనమ్మారు: సర్కార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్