బుస్సుమనే కొత్త బీర్లు! తెలంగాణలో 26 కొత్త బ్రాండ్లు! ప్రభుత్వ రేట్లకేనట?
బీర్ల కొరత కారణంగా కొత్త బ్రాండ్లతో బీర్లు అందుబాటులోకి రానున్నాయని తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: బీర్ల కొరత కారణంగా కొత్త బ్రాండ్లతో బీర్లు అందుబాటులోకి రానున్నాయని తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌లోకి వచ్చే కొత్త బీర్ల బ్రాండ్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్ని బ్రాండ్ల పేర్లు నెటజన్లను ఆకర్షిస్తోంది. అందులో దబాంగ్, హంటర్, లేమౌంట్ అనే బ్రాండ్స్ పేర్లు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. అయితే, దబాంగ్, హంటర్ తరహాలో తెలంగాణలో రానున్న 26 రకాల కొత్త బీర్ల బ్రాండ్స్ రానునట్లు సమాచారం. సోమ్ డిస్టిలరీస్, టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జొటికా లాంటి 5 కంపెనీలు కలిసి తెలంగాణలో 26 రకాల కొత్త బీర్లు మార్కెట్లోకి తేనున్నట్లు తెలిసింది.
ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకేనట
ఈ క్రమంలోనే కొత్త బీర్ల బ్రాండ్లపై ఎక్సైజ్ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. రాష్ట్రంలో బీర్ల కొరత ఉండటంతో ఈ కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకే బీర్ల సరఫరాకు కంపెనీ అంగీకరించినట్టు సమాచారం. కాగా, బీర్ల సప్లైలో యూబీ కంపెనీదే మెజారిటీ వాటా. అయితే, గత సర్కార్ యూబీ కంపెనీకి 450 కోట్లు పెండింగ్ పెట్టిందని, అందుకే బీర్ల తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. బీర్ల కొరత విషయం తెలుసుకోని ఐదు కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలిసింది. కొత్త బీర్ల బ్రాండ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరు రకాల గ్యారంటీలు .. ఆరు రకాల బీర్లు.. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ అని నెటిజన్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తెచ్చే కొత్త బీర్లు హెల్త్‌ను మరింత పాడు చేస్తోందేమోనని మందుబాబులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.