మణిపూర్‌లో తెలంగాణ పౌరుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్
మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలంగాణ పౌరుల కోసం తెలంగాణ పోలీసులు అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలంగాణ పౌరుల కోసం తెలంగాణ పోలీసులు అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. వారు సహాయం కోసం ఐపీఎస్ డీఐజీ సుమతి టీఎస్ హెల్ప్‌లైన్ నంబర్ 7901643283, ఇమెయిల్ dgp@tspolice.gov.inని సంప్రదించవచ్చని తెలంగాణ పోలీస్ అధికారులు తెలిపారు. ఫోన్ లైన్‌లు 24/7 తెరిచి ఉంటాయని, టీఎస్ పోలీసులు మణిపూర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మద్దతిస్తున్నారని అధికారులు తెలిపారు.