కేసీఆర్ ఒక్కడే 24 గంటల కరెంట్ ఎలా ఇచ్చాడో తెలుసా? బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణలో మరోసారి కరెంట్ పాలిటిక్స్ మొదలైనట్లు కన్పిస్తోంది. విద్యుత్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు తాజాగా 12 పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-15 11:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి కరెంట్ పాలిటిక్స్ మొదలైనట్లు కన్పిస్తోంది. విద్యుత్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు తాజాగా 12 పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది. 24 గంటల కరెంటు కేసీఆర్ ఇచ్చాడు, కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయారని తెలిపింది.

ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వలేకపోతున్నాడని విమర్శించింది. ‘కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న ఆశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు’ అని పేర్కొంది. తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆరాటంతో కేసీఆర్‌ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడని, నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరు.. సరైన సమయంలో కాంగ్రెస్‌కి బుద్ధి చెబుతారని ట్వీట్ చేశాడు.

Tags:    

Similar News