Holiday: ఏప్రిల్ 23వ తేదీని సెలవుదినంగా ప్రకటించాలి.. తెరపైకి కొత్త డిమాండ్

హిందువులు జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటి.

Update: 2024-04-19 10:01 GMT

దిశ వెబ్ డెస్క్: హిందువులు జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటి. కాగా ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తేదీన వచ్చింది. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీన సెలవు ఇవ్వాల్సిందిగా తెలంగాణ విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి నరసింహమూర్తి పండరీనాథ్, బజరంగ్‌దల్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో వారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినాయక చవితి, శ్రీరామనవమి వేడుకల తరువాత హిందువులు జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి అని పేర్కొన్నారు.

ఇక ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా వీర హనుమాన్ విజయ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలానే ఈ యాత్ర ఈ నెల ఏప్రిల్ 23వ తేదీన గౌలిగూడ శ్రీరామ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఈ ర్యాలీలో దాదాపు 3 లక్షల మంది హిందువులు పాల్గొననున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆ రోజుని అనగా ఏప్రిల్ 23వ తేదీని సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

 

Tags:    

Similar News