CPGET పూర్తి షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీగెట్) నోటిఫికేషన్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీగెట్) నోటిఫికేషన్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో రిలీజ్ చేశారు. ఈనెల 18వ తేదీ నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా జూన్ 17వ తేదీ వరకు అధికారులు గడువు విధించినట్లు సీపీ గెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి స్పష్టంచేశారు. కాగా లేట్ ఫీజు రూ.500 తో జూన్ 25 వరకు, ఆలస్య రుసుము రూ.2000 తో జూన్ 30 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రవేశ పరీక్ష జులై మొదటి వారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొత్తం 294 కాలేజీల్లో 51 పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు నుంచి క్లాసులు నిర్వహించాలని భావిస్తున్నారు. వివరాలకు www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in వెబ్ సైట్లను పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.