పొద్దు పొద్దునే CM రేవంత్ ఇంటికి 2008 DSC అభ్యర్థులు.. ప్లకార్డులతో నిరసన

2008 డీఎస్సీ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం తెల్లవారుజామునే హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు చేరుకొని ప్లకార్డులతో నిరసన తెలిపారు.

Update: 2024-02-19 03:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2008 డీఎస్సీ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం తెల్లవారుజామునే హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు చేరుకొని ప్లకార్డులతో నిరసన తెలిపారు. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తమకు పోస్టింగులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 2008 డీఎస్సీలో డిఎడ్ అభ్యర్థులకు 30 శాతం వెయిటేజ్ మార్కులు కలుపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మూడేళ్ల క్రితం ఏపీలో డిఎడ్ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణకు చెందిన అభ్యర్థులు సైతం ఇక్కడి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వారికి ఈ నెల 8వ తేదీన డీఎస్సీ అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించుకునే అంశాన్ని మరోమారు పరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. నాలుగు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంటూ మార్చి 21కి విచారణ వాయిదా వేసింది.

Tags:    

Similar News