వావ్ తెలంగాణ పోలీస్.. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల విధులకు 19 మంది సెలెక్ట్

తెలంగాణ పోలీసు శాఖకు చెందిన ఈ ఆఫీసర్స్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ద్వారా వివిధ దేశాలలో నియమించే పీస్ కమిషన్ విధులను నిర్వహించేందుకు ఎంపికైయ్యారు.

Update: 2024-06-20 06:42 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణ పోలీసు శాఖకు చెందిన ఆఫీసర్స్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ద్వారా వివిధ దేశాలలో నియమించే పీస్ కమిషన్ విధులను నిర్వహించేందుకు ఎంపికైయ్యారు. రాష్ట్ర పోలీసు విభాగం నుంచి మొత్తం 22 మంది ఈ పరీక్షలకు హాజరు కాగా అందులో 19 మంది ఎంపికయ్యారు. ఇలా ఈ పోలీసు అధికారులు ఇప్పుడు అంతర్గత భద్రత లోపించి శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా ఉన్న దేశాలలో ఈ అధికారులు ఏడాది పాటు విధులు నిర్వహించి అక్కడ శాంతి సామరస్యాలు నెలకొందేందుకు తమ వంతు పాత్రను నిర్వహించనున్నారు.

దీని కోసం ఢిల్లీ జూన్ 6 నుంచి 15 వరకు న్యూ యార్క్ నుంచి వచ్చిన పోలీసు అధికారులు ఈ పరీక్షలను నిర్వహించారు. ఇందులో ఆంగ్లం, డ్రైవింగ్ , ఫైరింగ్ వంటి అంశాలలో పరీక్షలను పెట్టారు. దేశవ్యాప్తంగా 225 హాజరు కాగా అందులో 164 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 19 మంది తెలంగాణ నుంచి ఉండడంతో రాష్ట్ర పోలీసు విభాగం ప్రతిష్ఠ దేశవ్యాప్తంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఎంపికైన తెలంగాణ పోలీసు అధికారులు వీరే...

కే.ఎం.కిరణ్ కుమార్, ఏసీబీ, హైదరాబాద్ సీసీఎస్

నర్సింగ్ రావు డిఎస్పీ, యాంటీ నార్కోటిక్ బ్యూరో

అలెక్స్, కమాండెంట్

దేవేందర్ సింగ్ , ఎస్పీ

చల్లా శ్రీధర్, డిఎస్పి , యాంటీ నార్కోటిక్స్ బ్యూరో

ప్రతాప్ , డిఎస్పి విజిలెన్స్ విభాగం

శ్రీధర్ రెడ్డి, డిఎస్పి, కోదాడ

జూపల్లి రమేశ్, ఏసీపీ

మాజిద్ అలీ ఖాన్ , ఏసీపీ

సురేశ్, ఇన్స్ పెక్టర్, సైబరాబాద్

యాదగిరి, హెడ్ కానిస్టెబుల్, అలేరు పీఎస్

విజయ్ కుమార్ , సిఐడి, ఇన్స్ పెక్టర్

శ్రీనివాసులు, హెడ్ కానిస్టెబులు..

కొసమెరుపు....

నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే వారికి ప్రస్తుత పరిస్థితుల్లో సరైన గుర్తింపు లేదని, పోస్టింగ్ పొందాలంటే వ్రుత్తి నైపుణ్యతకు చోటు లేదని, కలరింగ్ తో పాటు పొలిటికల్ మెనేజ్ మెంట్ స్కిల్స్ ఉంటే సరిపోతుండడంతో వాటి కోసం తాపత్రయం పడడం కన్నా ఇలాంటి సేవలు ఉత్తమమని అందుకే తాము ఈ పరీక్షలు రాసి తమ టాలెంట్‌ను నిరూపించుకుని ప్రశాంతంగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన సంతృప్తితో విదేశాలలో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను రాబట్టిన పోలీసు ఆఫీసర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం.


Similar News