Bonalu Special : ఉజ్జయిని మహంకాళి బోనాలకు 175 ప్రత్యేక బస్సులు..

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 175 ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోందని ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

Update: 2024-07-19 13:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 175 ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోందని ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. హైదరాబాద్ లోని 24 ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ప్రత్యేక బస్సులు తిప్పనుందని స్పష్టం చేశారు.

కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్‌ చెరు, ఈసీఐఎల్‌, మెహిదీపట్నం, దిల్‌ షుక్‌నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి, హకీంపేట్, మల్కాజిగిరి, నాంపల్లి తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఈ నెల 21 నుంచి 22 వరకు జాతర జరగనుంది.

 

Tags:    

Similar News