ఏ1గా అరికెపూడి గాంధీ.. 11 సెక్షన్ కింద కేసు

కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై మొత్తం 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Update: 2024-09-12 14:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో సహా మరో 40 మంది అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఆయనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఎస్సై మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమోటోగా కేసు నమోదైంది. కేసులో అరికెపూడిని ఏ1గా పేర్కొన్న పోలీసులు.. బీఎన్ఎస్ చట్టంలోని మొత్తం 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 189, 191(2), 191(3), 61, 132, 329, 333, 324(4), 324(5), 351(2), 190 కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ కాపీ ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే అరెస్టైన కొద్ది సేపటికే అరికెపూడి గాంధీ బెయిల్ మీద బయటకొచ్చారు.

ఇదిలా ఉంటే గురువారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటివద్దకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరుకోవడం ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి నేతలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. ఆ సందర్భంలోనే కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిమీద రాళ్ళు, కోడిగుడ్లు విసరడంతో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. దీంతో అరెకపూడి గాంధీ వర్గాన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు సూచించినప్పటికీ వినకపోవడంతో నార్సింగ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కాగా.. సాయంత్రం బెయిల్ పై విడుదల అయ్యారు.


Similar News